కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మరోసారి ప్రశ్నించే అవకాశం లేదు. విచారణ అనంతరం పోలీసులు మరోసారి ప్రశ్నించాల్సి ఉంటుందనే సంకేతం కూడా ఇవ్వలేదు. ఒక్క సిట్టింగ్‌తోనే ఆయన ఎంక్వయిరీ ప్రక్రియను సిట్ టీమ్ పూర్తి చేసింది. సిట్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్‌రావులను ఫస్ట్ టైమ్ విచారించిన సిట్ బృందం అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు.
సజ్జనార్ (CP Sajjanar) సైతం గతంలో ప్రకటనలో ఇదే అంశాన్ని తెలియజేశారు. కానీ కేసీఆర్ (KCR) విషయంలో మాత్రం ఒకే రోజున ఆయన ఎంక్వయిరీ ప్రాసెస్‌ను పూర్తి చేసింది. దాదాపు ఐదు గంటల విచారణకు హాజరైన తర్వాత కొద్దిసేపు పార్టీ నేతలతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలపైనా వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కు వెళ్ళిపోయారు.
Read Also: ప్రొటెస్ట్ సక్సెస్ కాలేదెందుకు?.. బీఆర్ఎస్ నేతల్లో చర్చ
Follow Us On: X(Twitter)


