కలం, వెబ్డెస్క్: SIR Tamilnadu | తమిళనాడులో ఓటర్ల జాబితా నుంచి 97 లక్షల ఓట్లు తొలగించారు. ఈ మేరకు తమిళనాడు ఎన్నికల ప్రధానాధికారి అర్చన పట్నాయక్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రెండో దశలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యే సమగ్ర సవరణ (SIR) 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో తమిళనాడు ఒకటి. గడువు ముగియడంతో ‘సర్వే’ వివరాల ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించారు.
‘SIR’ సర్వేకు ముందు తమిళనాడులో 6.41కోట్ల ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 5,43,76,755గా నమోదైంది. ఇందులో 2.66కోట్ల మంది మహిళలు, 2.77కోట్ల మంది పురుషులు ఉన్నారు. వలసలు, మరణాలు, డూప్లికేట్ కారణంగా 97లక్షల ఓట్లు తొలగించినట్లు సీఈవో చెప్పారు. ఇందులో చనిపోయినవాళ్లవి 26.94లక్షలు ఉండగా, 66.44 లక్షల ఓట్లు వలసలు లేదా వేరే ప్రాంతంలో స్థిరపడినవి. అలాగే 3,39,278 ఓట్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైనవని తెలిపారు. కాగా, తొలగించిన ఓట్లలో 14.25లక్షల ఓట్లు చెన్నై నగరం పరిధిలోనివి.
Read Also: కాంగ్రెస్ ఏఐ వీడియో వివాదం.. గుజరాత్ కోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: Sharechat


