కలం, మెదక్ బ్యూరో: డ్యాం సేఫ్టీ అధికారుల హెచ్చరికలతో సింగూరు ప్రాజెక్టు (Singur Project) మరమ్మత్తులు ప్రారంభమైనప్పటికి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను అగం చేస్తుంది. ప్రాజెక్టు రివిట్ మెంట్ పనులు పనులు అగిపోవడంతో ..ఇప్పటికే క్రాప్ హలీ డేతో నష్టపోయిన రైతులు తీవ్ర అందోళన చెందుతున్నారు.
మరమ్మత్తు పనులు చేయడానికి ప్రకృతి సహకరించినా.. ఏడాదిగా చేస్తున్న పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ముందుకు సాగడంలేదు. ప్రాజెక్టు రిపేర్లు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్ధితి నెలకొంది. సాగు అవసరాలతో పాటు తాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు పనులు నిలిచిపోవడం ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి.
రిపేర్ల పేరుతో ప్రాజెక్టు ఖాళీ..
సింగూరు ప్రాజెక్టు భద్రతపై రిపోర్టు రావడంతో, డ్యాం సేఫ్టీ రివ్యూ ఫ్యానల్ ఇచ్చిన నివేదిక మేరకే సింగూరుకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 16 కోట్ల నిధులను డ్యాం మరమ్మత్తుల కోసం కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సమయానికి ప్రాజెక్టులో 15 టిఎంసీ నీరు ప్రాజెక్టులో నిల్వ ఉన్నది. సింగూరు ప్రాజెక్టును మరమ్మత్తుల కోసం పూర్తి స్థాయిలో ఖాళీ చేయడంతో ఆయకట్టు రైతుల వ్యవసాయం చేయలేదు. దీంతో ప్రాజెక్టు రిపేర్ల కోసం గతేడాది డిసెంబర్లో సింగూరును పూర్తి స్థాయిలో ఖాళీ చేశారు.
ప్రాజెక్టు కింద సాగవుతున్న 40 వేల ఎకరాలతో పాటు ఘనపురం ప్రాజెక్టు కింద క్రాప్ హాలీడే ప్రకటించారు. పనుల కోసం ప్రాజెక్టులోని 15 టీఎంసీల నీటిని డిసెంబర్లోనే ఖాళీ చేయడంతో, అటు యాసంగి , ఇటు గత ఖరీఫ్ వానాకాలం, రబీ సీజన్లలో పాటు ప్రస్తుత ఖరీఫ్ వానాకాలం రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణంగా యాసంగి సీజన్లో సింగూరు నీటితో కళకళలాడే పొలాలు ఈసారి ఎడారిని తలపించాయి.ప్రాజెక్టును ఖాళీ చేయడంతో యాసంగిలో పంటలు వేయవద్దని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వేలాది మంది రైతులు సాగుకు దూరమై ఆర్థికంగా దెబ్బతిన్నారు. బావులు, బోరుబావుల్లో భూగర్భ జలాల మట్టం కూడా పడిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా పోయాయి.
అగిన మరమ్మత్తు పనులు..
29.9 టీఎంసి నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న సింగూరు ప్రాజెక్టు భద్రతపై రిపోర్టు రావడంతో, డ్యాం సేఫ్టీ రివ్యూ ఫ్యానల్ ఇచ్చిన నివేదిక మేరకే సింగూరుకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 16 కోట్ల నిధులను డ్యాం మరమ్మత్తుల కోసం కేటాయించి, 14 కోట్ల రుపాయలు మంజూరు చేసింది.మరమ్మత్తుల పనుల కోసం ప్రాజెక్టులోని 15 టీఎంసీల నీటిని డిసెంబర్లోనే ఖాళీ చేయడంతో, అటు యాసంగి , ఇటు గత ఖరీఫ్ వానాకాలం, రబీ సీజన్లలో పాటు ప్రస్తుత ఖరీఫ్ వానాకాలం రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
వేలాది మంది రైతులు క్రాప్ హలీ డేతో ఇబ్బందులు పడుతున్న, క్షేత్రస్థాయిలో మాత్రం సింగూరు ప్రాజెక్టు రివిట్ మెంట్ మరమ్మత్తు పనులు నిలిచిపోయాయి. పనుల ప్రారంభించి దాదాపు ఏడాది కావస్తున్నా కనీసం ఒక కిలోమీటర్లు కూడా పనులను పూర్తి చేయలేకపోయారు. సింగూర్ ప్రాజెక్టు రివిట్ మెంట్ మరమత్తు పనులు కేవలం 20% పనులు పూర్తి అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కనీసం 500 మీటర్ల కూడా రివట్మెంట్ పనులు పూర్తి కాలేదు.
సింగర్ ప్రాజెక్టు కట్ట రివట్మెంట్ కోసం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సింగూర్ కట్ట గోడలను పూర్తి చేయకుండానే అసంపూర్తిగా పనులను వదిలేసి వెళ్లిపోయారు. ఈ యేడాది వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దింతో పనులు చేసేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ మాత్రం అర్ధాంతరంగా వదిలేశారు. మరమ్మత్తుల పనుల కోసం తీసుకవచ్చిన యంత్రాలు ,వాహానాలు సైతం ప్రాజెక్టు దారిదాపుల్లో కన్పించడం లేదు. సింగూర్ డ్యామ్ రివిట్మెంట్ మరమ్మతు పనులలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, ప్రణాళిక, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
సరైన ప్లానింగ్ తో పనులు ప్రారంభం చేయకుండా ఇష్టరీతిన పనులు చేస్తునట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా డ్యామేజ్ అయిన గేట్ల సమీప ప్రాంతంలో పనులు మొదలుపెట్టకుండా, అధికారులు ఎక్కడో చివరి నుండి పనులు ప్రారంభించారు,దింతో నీటి నిల్వ చేసుకునే అవకాశం లేకపొవడంతో రైతంగం నష్టపోతుందన్నది. అధికారులు కేవలం సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు ఏ మేర పనులు నిర్ణీత గడుపులోగా పూర్తి చేయడంలో విఫలం అయ్యారు.
తాగునీటికి ప్రమాద ఘంటికలు..
అగష్టు నెల నుండి ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టు ఇన్ ఫ్లో వస్తు ఉంటుంది. కానీ ప్రసుత్తం ప్రాజెక్టులో4.22 టిఎంసీ నీటి నిల్వ ఉన్నది. ఈ నీటితో హైదరాబాద్, మిషన్ భగీరధ తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. సింగూరు ప్రాజెక్టు నుండి హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి, జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సింగూరు నుంచి పంపింగ్ చేసి తరలిస్తారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 4.22 టీఎంసీలు మాత్రమే ఉండడంతో కనీసం జనవరి వరకు కూడా త్రాగునీరు జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో సరఫరా చేసే అవకాశం లేదని అధికారులు అనాధికారికంగా చెబుతున్నారు.
వర్షాకాలం లోపు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పనులు జరగకపొవడంతో వచ్చే సీజన్లోనూ క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం కన్పిస్తుంది. రివిట్ మెంట్ పనులు అగిపోవడం , ముందే నీటిని వదిలేయడం, కొత్తగా వచ్చే వర్షపు నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో సింగూరు అయకట్టు రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. సాగు కోసం కేవలం బోర్ల పైనే అధారపడే పరిస్ధితి వచ్చింది. సింగూరు ప్రాజెక్టు భద్రత ఎంత ముఖ్యమో, తమ జీవనాధారమైన వ్యవసాయం కూడా అంతే ముఖ్యమని రైతులు చెబుతున్నారు.
ప్రాజెక్టు మరమ్మత్తుల వలన దాదాపు నాలగు సీజన్లు క్రాప్ హలీ డే ఉందని సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా వరుసగా నాలుగు సీజన్లు సాగు చేయకుంటే తమ కుటుంబాలు వలసల వెళ్ల వల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులను పూర్తి చేసి, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులను పూర్తి చేసి, రాబోయే రోజుల్లో నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే క్రాప్ హాలిడే వల్ల నష్టపోయిన సింగూరు ఆయకట్టు రైతులకు తగిన ఆర్థిక ప్యాకేజీ లేదా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

