ఓటు తొల‌గించ‌డం ప్రజాస్వామ్య విరుద్ధం: ఆప్ నేత సయ్యద్ హైదర్

కలం, నిర్మల్: సర్ ప్రక్రియలో భాగంగా బోగస్, డూప్లికేట్ ఓట్ల తొలగింపును సమర్థిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, నిర్మల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ (Syed Haider) అన్నారు. అయితే ఆ పేరుతో ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓటు హక్కు తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై ఫిర్యాదులు వచ్చినా, కొందరి పేర్లు తిరిగి చేర్చలేదని ఆరోపించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>