పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: సింధు ఆదర్శ్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసి (GHMC) పరిధిలోని భారతినగర్ డివిజన్‌లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి (Sindhu Adarsh Reddy) అధికారులను కోరారు. ఈ మేరకు ఆమె సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను కలిసి పలు అభివృద్ధి అంశాలను దృష్టికి తీసుకువచ్చారు. భారతినగర్ డివిజన్‌లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) సంబంధిత పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కొనసాగుతున్న పనులు కూడా కాంట్రాక్టర్ల ద్వారా వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షణ పెంచాలని కోరారు. బాంబే కాలనీ కమ్యూనిటీ హాల్‌కు ధరను నిర్ణయించాలని, అలాగే ఎంఎంటీఎస్ (MMTS) నుంచి అన్నమయ్య ఎన్‌క్లేవ్ వరకు బీటీ రోడ్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని కూడా ఆమె (Sindhu Adarsh Reddy) కోరినట్లు తెలిపారు. ఈ అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సింధు ఆదర్శ్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: తెలంగాణలో ‘బాల్యం’ బందీ.. ప్రమాదకర పనుల్లో 89,000 మంది పిల్లలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>