కులగణన ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులకు సన్మానం

కలం, నిజామాబాద్ బ్యూరో : సామాజిక, రాజకీయ, ఆర్థిక కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటిసారిగా సర్వే నిర్వహించిన సందర్భంగా ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీతో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం భేటీ అయ్యారు. హైదరాబాద్ (Hyderabad) లో కమిటీ చైర్మన్ సుప్రీం కోర్ట్ మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె అయిలయ్యలను వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్థిక సామాజిక, రాజకీయ అసమానతలను తొలగించేందుకు కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నివేదిక తయారు చేశారని కొనియాడారు. అనంతరం కమిటీ మెంబర్స్‌ని నాయకులు ఘనంగా సన్మానించారు.

Read Also: ‘నామ్‌ కే వాస్తే’గా డీలిమిటేషన్ కమిషన్.. సీట్ల పెంపు ఆల్రెడీ ఖరారు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>