Mobile Popup Ad
Mobile Popup Ad

నారుమడిపై వానర సైన్యం బీభత్సం

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా నంగునూరు మండలంలో కోతుల గుంపులు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. కనీసం నాట్లు కూడా వేయకముందే వానర సైన్యం నారుమడి పై దండయాత్రకు దిగుతోంది. మండల కేంద్రంలో నెలుట్ల కనకయ్య అనే రైతుకు చెందిన సుమారు రెండు ఎకరాల వరి నారుమడిపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసి నారును పూర్తిగా పీకేసి నాశనం చేసింది. కండ్ల ముందే నారుమడి ధ్వంసం కావడంతో సదరు రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

గ్రామంలో కోతుల బెడద ఏ స్థాయిలో ఉందంటే.. గతంలో ఇక్కడ రైతులు వేరుశనగ, మొక్కజొన్న వంటి ఇతర పంటలను విస్తృతంగా పండించేవారు. కానీ, కోతుల గుంపులు ఆ పంటలను అస్సలు ఉంచకపోవడంతో, విధిలేని పరిస్థితుల్లో రైతులంతా వరి సాగు వైపు మళ్లారు. అయితే ఇప్పుడు వానర మూకలు వరి పంటను సైతం వదిలిపెట్టడం లేదు. కనీసం నాట్లు వేయడానికి కూడా వీలు లేకుండా నారుమళ్లను తొక్కి, పీకేస్తూ రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తున్నాయి.

”గత కొన్ని ఏళ్లుగా కోతుల వల్ల ఎన్నో పంటలు నష్టపోయి ఆర్థికంగా కుంగిపోయాం. వేరే పంటలు వేసే పరిస్థితి లేక వరి వేస్తే.. ఇప్పుడు నారుమడిని కూడా ఉంచడం లేదు. పెట్టుబడులు కూడా దక్కేలా లేవు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ కోతుల బెడద నుండి మమ్మల్ని కాపాడాలి” అని రైతులు కోరుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>