అయోధ్య రామమందిరం విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదు

కలం, వెబ్ డెస్క్: సంచలనం క​లిగిస్తోన్న అయోధ్య (Ayodhya) రామమందిరం విరాళాల్లో అక్రమాల అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 8 మందిపై BNS సెక్షన్లు 306, 316(5), 317(4) ,317(5), 61, 3(5) కింద FIR నమోదు చేశారు. పోలీసుల అదుపులో ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారు. ఈ అంశంలో ఇప్పటికే సిట్ విచారణ జరిపి, అవకతవకలు నిజమేనని తేల్చడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని యూపీ ప్రభుత్వం భావించింది. ఆభరణాలు చోరీ చేస్తుండగా సీసీ టీవీలో స్పష్టంగా రికార్డయింది. భద్రతలో లోపాలను ఆసరాగా చేసుకుని.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఆభరణాలు, నగదు కాజేసినట్లు గుర్తించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>