Mobile Popup Ad
Mobile Popup Ad

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా?

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామా చేయబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన్ను పదవి నుంచి తప్పుకోవాలని హై కమాండ్ సూచించినట్లు పేర్కొన్నాయి. దీనికి అంగీకరించిన సిద్ధరామయ్య.. ఒకట్రెండు రోజుల సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే.శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వివరించాయి. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్‌తో ఆరు గంటల పాటు జరిగిన చర్చల్లో ఈ నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>