మావోయిస్టులకు అన్నం పెట్టిన ఎస్సై రామేశ్వ‌ర్

కలం, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)  రాష్ట్రంలోని కాంకేర్(Kanker) జిల్లా దండకారణ్య అటవీ ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. పార్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై రామేశ్వర్ (SI Rameshwar) తన సిబ్బందితో కలిసి అడవిలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది మావోయిస్టులు ఎదురుపడ్డారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఉద్రిక్తతలు పెరిగి ఘర్షణలకు దారి తీస్తాయి. అయితే ఈ ఘటనలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది.

అప్పటికే ఆ మావోయిస్టులు (Maoists) దండకారణ్యంలో చాలా దూరం నుంచి కాలినడకన ప్రయాణించి తీవ్ర అలసటతో, ఆకలితో ఉన్నారు. వారి పరిస్థితిని గమనించిన ఎస్సై రామేశ్వర్ మానవత్వంతో స్పందించారు. తన దగ్గర ఉన్న ఆహారాన్ని వారికి అందించారు. పోలీసులు ఇచ్చిన ఆహారాన్ని మావోయిస్టులు స్వీకరించి తిన్నారు. అనంతరం ఎస్సై రామేశ్వర్ వారితో, హింసా మార్గాన్ని వదిలి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో కలవాలని సూచించారు. సమాజంలో తిరిగి స్థిరపడితే మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>