ప్రధాని మోదీకి సీఎం విజయ్ కీలక లేఖ

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) కావేరి జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకేదాటు ఆనకట్ట నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వవద్దని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు అమలైతే తమిళనాడుకు లభించే కావేరి జలాలపై ప్రభావం పడుతుందన్నారు. దీంతో రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని సీఎం విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కావేరి జలాల పంపిణీకి సంబంధించిన చట్టపరమైన హక్కులను కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలన్నారు. రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు, న్యాయస్థాన తీర్పులను గౌరవిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మోదీని సీఎం విజయ్ కోరారు.

Read Also: ఆందోళనకారులపై కంగనా రనౌత్ ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>