Mobile Popup Ad
Mobile Popup Ad

తల్లీబిడ్డను కలిపిన మహిళా ఎస్ఐ

కలం, ఖమ్మం బ్యూరో: ఓ మహిళా ఎస్ఐ తల్లీబిడ్డను కలిపిన ఘటన ఖమ్మం (Khammam)  జిల్లాలో జరిగింది. జిల్లాలోని ముదిగొండ పోలీస్ స్టేషన్‌‌ ఎస్ఐగా హరిత (SI Haritha) బాధ్యతలు నిర్వహిస్తోంది. ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒంటరిగా తిరుగుతున్న పదేళ్ల బాలుడిని చేరదీసి విచారించారు. తన పేరు కట్టా పెనుకొండయ్య, జగ్గయ్య పేట అని చెప్పాడు. మిగతా వివరాలు కూడా ఎస్ఐ హరిత తెలుసుకున్నారు. అనంతరం తల్లి కట్టా విజయ కుమారిని స్టేషన్‌కు పిలిచి పిల్లాడిని అప్పగించింది. ఎస్ఐ చాకచాక్యంగా వ్యవహరించి తల్లీబిడ్డను కలిపినందుకు ఆమెను పలువురు ప్రశంసించారు.

Read Also: 15 నిమిషాల శ్రీవారి దర్శనం.. ట్రోల్స్‌పై శివానీ నగరం స్పందన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>