రీల్స్ పిచ్చి.. తండ్రిని కొరియర్‌లా మూట కట్టిన కూతురు!

కలం, వెబ్ డెస్క్: రోజురోజుకూ రీల్స్ పిచ్చి (Reels craze) ముదురుతోంది. ‘ఏం చేసైనా సరే.. ఫేమస్ అవ్వాలి అంతే’ అన్న ధోరణిలో ఏదిపడితే అది చేసేస్తున్నారు. ఇటీవలే తుపాకీతో రీల్స్ చేస్తూ ఓ యువకుడు కాల్చుకొని స్పాట్‌లోనే చనిపోయిన ఘటన మరువక ముందే మరో ఘటన షాక్‌కు గురిచేస్తోంది. తాజాగా రీల్స్ మోజులో తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిందో కూతురు. ఏకంగా కొరియర్‌లా మూట కట్టి రీల్స్ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లోని వ్యాలీకావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక భారీ పార్సిల్ తీసుకుని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కొరియర్ సెంటర్‌కు వెళ్లారు. అయితే పార్శిల్‌ లోపల కదలికలను గుర్తించిన అక్కడి సిబ్బంది దాన్ని తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

పార్సిల్ ఓపెన్ చేయగానే లోపలి నుంచి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. అవాక్కయిన సిబ్బంది ఇదేంటని ఆ కుటుంబాన్ని ప్రశ్నించారు. తమకు బస్సు టికెట్లు దొరక్క ఇలా చేశామని వారు చెప్పారు. టిక్కెట్లు దొరక్కపోతే ఇలా చేస్తారా? అంటూ సిబ్బంది ప్రశ్నించడంతో ఫన్నీ రీల్ తీయడానికి ఇలా ప్లాన్ చేసినట్లు కుమార్తె చెప్పింది. టికెట్లు దొరకకపోతే ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడతారా? అంటూ సదరు సిబ్బంది ఆ యువతిని ఘాటుగా ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. సిబ్బంది మాటలను లెక్కచేయని యువతి అంత దూరం నుంచి కష్టపడి వచ్చాం కాబట్టి.. తమ పార్శిల్‌ను పంపించాల్సిందే అంటూ గొడవకు దిగారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ పిచ్చితో యువత వికృత ఆలోచనలతో దిగజారుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>