Mobile Popup Ad
Mobile Popup Ad

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. స్పందించిన సీఎం రేవంత్‌

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేశ్ కుమార్‌కు పోలీసులు నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారని సీఎం అన్నారు. ఇందులో తమ ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశారు. దీనిపై మొత్తం దర్యాప్తునకు సిట్ వేశామని వెల్ల‌డించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పదే పదే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి.. ఈ కేసు దర్యాప్తునకు సిట్ (స్పెషల్ ఇంటరాగేషన్ టీం) వేశామని అనడం గమనార్హం. అన్ని కేసుల్లాగే ఈ కేసును కూడా సైడ్ కు నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు మొదలయ్యాయి. మరోవైపు ఈ కేసులో కొత్త విషయాలు బయటికు వస్తున్నాయి. ఫాంహౌస్‌ పార్టీలో మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. కొకైన్‌, ఎండీఎంఏతో పాటు మేథోఇథిపిన్ వాడినట్లు వెల్లడైంది. మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి రెండు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎక్కువ కిక్ ఇచ్చేందుకు ఖరీదైన మద్యంతో పాటు డ్రగ్స్ కూడా వాడినట్లు తేల్చారు. కౌశిక్ రవి సిమ్లా నుంచి కొకైన్‌ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>