విశాఖ HPCL రిఫైనరీలో అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: విశాఖలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (Visakhapatnam HPCL) రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పిచ్ టవర్ యూనిట్‌లో మంటలు మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే రిఫైనరీలోని ఫైర్ ఇంజిన్లు, నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ముందు జాగ్రత్త చర్యగా స్థానికులను కొంత దూరం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు, ఏదైనా ప్రాణ నష్టం సంభవించిందా.. అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>