కలం, సినిమా: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) బర్త్‌డే సందర్భంగా అభిమానులకు పుట్టినరోజు కానుక అందించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ సినిమా నుంచి తొలి పాట ‘తు మిల్ జాయే’ను విడుదల చేశారు. సంగీత, సినీ రంగాలకు చెందిన స్టార్స్ ఈ పాటను రూపొందించారు. అర్జిత్ సింగ్ అద్భుతమైన గాత్రం, ఎడ్ షీరన్ ప్రత్యేకమైన ర్యాప్ స్టైల్‌తో రూపొందిన ఈ పాట ఓ అరుదైన గ్లోబల్ మ్యూజిక్ కొలాబరేషన్‌గా రూపొందింది. అంతేకాదు.. వెండితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జోడీ మరోసారి ఈ పాటతో ప్రేక్షకులను అలరించనుంది. ‘కింగ్’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ మ్యూజిక్ వీడియో ప్రారంభమవుతుంది.
ఇందులో షారుఖ్ ఖాన్ చెప్పే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. “నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని. నా గురి నా ప్రేయసి గుండెపైనే. గుండెను చీల్చలేనివాడు అసలు ప్రేమికుడే కాదు” అంటూ ఆయన చెప్పే డైలాగ్‌తో తన పాత్ర ఎలా ఉండబోతోందో ఆసక్తి పెంచారు. ఆ తర్వాత మంచి జోష్ నింపే రొమాంటిక్ డ్యాన్స్ ట్రాక్ మొదలవుతుంది. బాలీవుడ్లో తన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జిత్ సింగ్, గ్లోబల్ పాప్ సెన్సేషన్ ఎడ్ షీరన్ కలిసి ఈ పాటను ఆలపించారు. రెండు విభిన్న సంగీత ప్రపంచాలను ఒక్కచోట చేర్చిన ఈ పాటకు మధుబంతి బాగ్చి తనదైన మధురమైన గాత్రంతో మరింత అందాన్ని తీసుకొచ్చారు. ‘కింగ్’ సినిమా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుంది.

