Mobile Popup Ad
Mobile Popup Ad

కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి దోచుకున్న దుండగులు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ (Hyderabad) లో హవాలా డబ్బు వ్యవహారం కలకలం రేపింది. కూకట్‌పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు కళ్లల్లో కారం కొట్టి సుమారు రూ.1 కోటి నగదును దోచుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. బహదూర్‌పూర ప్రాంతం నుంచి జీడిమెట్లకు హవాలా డబ్బును బైక్‌పై తీసుకెళ్తున్న అజాముద్దీన్, కుస్రుఫ్ అనే ఇద్దరిపై దుండగులు దాడి చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయం సమీపంలో వారిని అడ్డగించి కళ్లల్లో కారం పొడి చల్లి దాడికి పాల్పడ్డారు.

ఆ సమయంలో బాధితులు ఏమి జరుగుతుందో అర్థం చేసుకునేలోపే వారి వద్ద ఉన్న సుమారు రూ.1 కోటి నగదును దుండగులు లాక్కొని పరారయ్యారు. దాడి తర్వాత బాధితులు అజాముద్దీన్, కుస్రుఫ్ సమీప పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో కూకట్‌పల్లి ప్రాంతంలో హవాలా డబ్బు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>