Mobile Popup Ad
Mobile Popup Ad

షాకింగ్ .. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?

కలం, వెబ్ డెస్క్ : పంజాబ్ అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మే డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎం భగవంత్ మాన్ (CM Bhagwant Mann) మద్యం తాగి సభకు వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం మాట్లాడిన వీడియోను నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కార్మిక దినోత్సవం నాడు అసెంబ్లీ సమావేశానికి సీఎం ఇలాంటి స్థితిలో రావడం సిగ్గు చేటు అని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు శిరోమణి అకాళీ దళ్ నాయకులు అసెంబ్లీ సమావేశంలో విమర్శలు గుప్పించారు. పంజాబ్ ప్రజల సమక్షంలో ఆయనకు వెంటనే డ్రగ్ టెస్టు చేయించుకోవాలని సభలో డిమాండ్ చేశారు. దీంతో పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభలో గందగోళ పరిస్థితులు నెలకొన్న వేళ ప్రతిపక్ష పార్టీ నేతలకు సీఎం భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు. సభా మర్యాదను కాపాడాలని కోరారు. ఏది ఏమైనా వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>