వినాయక నవరాత్రి వేడుకల్లో శివపార్వతుల కల్యాణం

కలం, వనపర్తి: రేవల్లి మండల పరిధిలోని కేశంపేట గ్రామం (Keshampet Village) లో శివభక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

గణనాథుడి సమక్షంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామానికి చెందిన శివభక్తులు, మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాద వితరణతో పాటు అన్నదానం నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలతో కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో ముగిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>