అగ్ని ప్ర‌మాదంలో ఆ కేసు ఫైళ్లు లేవు : శిఖా గోయ‌ల్

క‌లం, వెబ్ డెస్క్‌: నాంప‌ల్లిలోని (Nampally) ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్ర‌మాదంపై (Forensic Lab Fire) డైరెక్ట‌ర్ శిఖా గోయ‌ల్ (Shikha Goel) కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదంలో 2015 సంవ‌త్స‌రంలో కేసుల‌కు సంబంధించిన ఏ ఫైళ్లు లేవ‌ని వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్దని సూచించారు. అగ్ని ప్ర‌మాదంపై నేడు శిఖా గోయ‌ల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదైంద‌ని, దర్యాప్తు కొన‌సాగుతోంద‌ని తెలిపారు. ల్యాబ్‌ను సీజ్ చేసి మ‌రోసారి క్లూస్ టీం, ఎస్‌బీ త‌నిఖీలు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆఫీస్‌లో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై ఆరా తీస్తున్నారు.

శిఖా గోయ‌ల్ ఘ‌ట‌నా స్థ‌లాన్ని విస్తృతంగా ప‌రిశీలించారు. అగ్నిప్ర‌మాదంలో కీల‌క ఫైళ్లు ద‌హ‌న‌మైన‌ట్లు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు. ఆఫీస్‌లో ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఏయే కేసుల‌కు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయ‌న్న దానిపై ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించారు. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల 8 నిమిషాలకు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. మంట‌ల‌ను ఉద్యోగి సాయికృష్ణ గ‌మ‌నించి అప్ర‌మ‌త్తం చేశాడు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జ‌రిగింద‌ని పోలీసులు చెప్తున్నారు.

Read Also: మున్సిపోల్స్ రిజల్ట్.. కేటీఆర్‌కు ‘ఇజ్జత్ కా సవాల్’

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>