కలం, వెబ్ డెస్క్ : నాంపల్లిలోని ఫొరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం ( FSL Fire Incident) పై ఉన్నతాధికారులు స్పందించారు. కీలక కేసులకు సంబంధిచని ప్రాపర్టీతో పాటు సమాగ్రి సురక్షితంగా ఉందని ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ షికా గోయల్ (Shikha Goel) ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారు. కేవలం కంప్యూటర్ ఫోరెన్సిక్ హాల్ ట్రైనింగ్ హాల్ మాత్రం పూర్తిగా కాలిపోయిందన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఫైర్ డిపార్డుమెంట్ కు సమాచారం అందడంతో వెంటనే స్పందించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారన్నారు. ఉదయం 10.08 గంటలకు ఎఫ్‌ఎస్‌ఎల్ భవనంలోని మొదటి అంతస్తులోని ఓ గది నుంచి పొగ రావడం గమనించిన ఒక ఉద్యోగి.. మిగతా సిబ్బందిని అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారమిచ్చారన్నారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL Fire Incident) భవనం మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, శిక్షణా హాల్, మరికొన్ని ఇతర సౌకర్యాలకు కొంత నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు జరగలేదని చెప్పారు. ఘటనపై మీడియాలోని కొన్ని నిరాధారమైన వాదనలు వస్తున్నాయని.. సంయమనం పాటించాలని శిఖా గోయల్ కోరారు.
Read Also: టీ20 వరల్డ్ కప్ : తడబడినా గట్టెక్కారు.. భారత్ బోణీ
Follow Us On : WhatsApp


