epaper
Wednesday, February 18, 2026
epaper

టీ20 వరల్డ్​ కప్​ : తడబడినా గట్టెక్కారు.. భారత్ బోణీ

కలం, వెబ్​డెస్క్​: టీ20 వరల్డ్​ కప్​లో (T20 World Cup) భారత్​ బోణీ కొట్టింది (India Beat USA). ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం యూఎస్​ఏతో జరిగిన మ్యాచ్​లో తడబడినా గట్టెక్కింది. ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​ చేసిన భారత్​ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​ (84 నాటౌట్​; 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్​లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మిగిలిన వాళ్లలో ఇషాన్​ కిషన్(20), తిలక్​ వర్మ(25), అక్షర్​ పటేల్​ మాత్రమే (14) రెండంకెల స్కోరు చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో షాడ్లే వాన్​ స్కాల్కివిక్​ 4 వికెట్లతో బెంబేలెత్తించాడు. హర్మీత్​ సింగ్​ 2 వికెట్లు తీయగా, మహ్మద్​ మెహసిన్​, అలీ ఖాన్​ చెరో వికెట్​ పడగొట్టారు.

ఛేదనలో యూఎస్​ఏ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడినా 29 పరుగుల తేడాతో ఓడిపోయింది (India Beat USA). ఆ జట్టు బ్యాటర్లలో మిలింద్​ కుమార్​(34), సంజయ్​ కృష్ణమూర్తి(37), శుభమ్​ రంజన్​(37) రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్​ సిరాజ్​ 3 వికెట్లు తీయగా, అక్షర్​ పటేల్​, అర్షదీప్​ సింగ్​ చెరో 2 వికెట్లు తీశారు. వరుణ్​ చక్రవర్తికి 1 వికెట్​ దక్కింది. సూర్యకుమార్​ యాదవ్​కు ‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​’ అవార్డు దక్కింది.

Read Also: బూతులు మాట్లాడేవారికి ప్రజలే బుద్ధిచెప్పాలి : వెంకయ్య నాయుడు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>