కలం, వెబ్ డెస్క్ : శర్వానంద్ లేటెస్ట్ సెన్సేషన్ ‘బైకర్’మూవీ ఓటీటీ (Biker OTT Release)లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో మే 1వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘బైకర్’ అనే ఒరిజినల్ టైటిల్‌తోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే, హిందీ వెర్షన్‌లో మాత్రం ఈ చిత్రాన్ని ‘శర్వా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.
మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ విభిన్నమైన స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజై భారీ వసూళ్లను రాబట్టింది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో శర్వానంద్ మోటోక్రాస్ రైడర్‌గా నటించాడు. అలనాటి యాంగ్రీ హీరో రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించింది. కాగా, ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత శర్వానంద్ కు సరైన హిట్ దక్కింది.

