‘నో స్టాక్’.. తెలంగాణలో డీజిల్ బాంబ్

కలం, తెలంగాణ బ్యూరో: Diesel Shortage | అమెరికా-ఇరాన్ యుద్ధంతో నిన్నమొన్నటిదాకా ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికీ ఆ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇంతలోనే డీజిల్ కొరత ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అలాంటి షార్టేజీ ఏమీ లేదంటున్నాయి. ఎల్పీజీ సరఫరాగానీ, పెట్రోల్, డీజిల్ సరఫరాగానీ తగ్గలేదని గంభీర ప్రకటనలు చేస్తున్నాయి. యథావిధిగా డిమాండ్‌కు తగినంత సప్లై ఉందని పదేపదే ప్రకటిస్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. ఈ పరిస్థితి కొరత వల్ల రాలేదని, ప్రజల్లో నెలకొన్న ఆందోళనతో ఏర్పడిన ప్యానిక్ క్రైసిస్ అని పేరు పెట్టాయి.

ఎల్పీజీ సంక్షోభంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేటు మెస్‌లు, రోడ్‌సైడ్ ఈటరీస్, ఫుట్‌పాత్ స్టాళ్లు టీ మొదలు బిర్యానీ వరకు అన్నింటి రేట్లు పెంచేశాయి. అవి రెగ్యులర్‌గా వాడే కమర్షియల్ సిలిండర్లు అవసరం మేరకు సరఫరా కాకపోవడంతో డబుల్ రేటు పెట్టి బ్లాక్‌లో కొనాల్సి వస్తున్నదనేది యజమానుల వాదన. తూచ్… సప్లైలో ఎక్కడా తేడా లేదంటున్నాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. ఇటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సైతం రోజువారీ బులెటిన్లలో ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్ సప్లై, డిమాండ్, సేల్స్ గణాంకాలను ప్రకటిస్తూ సంక్షోభం లేదనే భరోసా కల్పిస్తున్నాయి.

కాగితాల మీద లెక్కలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం ఇందుకు భిన్నం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల అవసరాలకు తగినంత డీజిల్, పెట్రోల్ సప్లై లేకపోవడంతో దాదాపు 10% బంకులు మూతపడ్డాయి. దీంతో సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని బంకులపై ఒత్తిడి పెరిగింది. జిల్లాల నుంచి ఆ ప్రెషర్ హైదరాబాద్ సిటీ వరకూ వ్యాపించింది. నగరంలోని కొన్ని పెట్రోలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తే మరికొన్ని మూతపడ్డాయి. అయినా సివిల్ సప్లైస్ డిపార్టుమెంట్ మాత్రం అబ్బే… కొరతా లేదు.. సంక్షోభం లేదు.. ఏ బంకూ మూతపడలేదు..
అని ప్రకటిస్తున్నది.

ఇప్పటివరకూ ఎల్పీజీ సంక్షోభంతో ఆహార పదార్ధాల రేట్లు మాత్రమే పెరిగాయి. ఇప్పుడు డీజిల్ క్రైసిస్‌తో కూరగాయలు మొదలు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడంలో చిక్కులు ఏర్పడ్డాయి. రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. చివరకు వినియోగదారులపై ధరల పెరుగుదల భారం పడుతున్నది. నగరం నుంచి జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు ప్రతి నిత్యం వెళ్ళే వేలాది ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ ధరలు పెరిగాయి. డీజిల్ కొరతతో కొన్ని సర్వీసులు తగ్గిపోయాయి. ప్రైవేటు వాహనాలకూ డీజిల్ ఇబ్బందులు తలెత్తాయి. హైవేల మీద బంకుల్లో నో స్టాక్ బోర్డులు తప్పడంలేదు.

రాష్ట్రంలో రోజుకు ఎన్ని లీడర్ల డీజిల్, పెట్రోలు అవసరం?.. సప్లై ఎంత ఉంటున్నది?.. ఎందుకు డిమాండ్ పెరుగుతున్నది?.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయి?.. ప్రభుత్వ లెక్కలు ఎలా ఉన్నాయి?.. గ్రౌండ్ రియాలిటీ ఏంటి?.. కలం 360 డిగ్రీస్ స్పెషల్ కథనం చదివేందుకు కింద్ ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Diesel Shortage
Diesel Shortage

Read Also: ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట: సీఎం రేవంత్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>