కలం, వెబ్ డెస్క్: యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన తాజా చిత్రం బైకర్ (Biker Movie). యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో శర్వానంద్‌కు తండ్రిగా సీనియర్ హీరో రాజశేఖర్ నటించారు. భారీ అంచనాల నడుమ రిలీజైన బైకర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా కలెక్షన్లతో పాటు బుకింగ్స్‌లోని రికార్డులు సృష్టిస్తోంది. బైకర్ ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్స్ రూ.18 కోట్లు వచ్చాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ ప్రమోట్ చేయడం సినిమాకు చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. మరోవైపు బుక్ మై షోలో సోమవారం ఎక్కువ టికెట్లు బుక్ అయిన సినిమాగా బైకర్ రికార్డు సృష్టించింది. సాధారణంగా వీకెండ్స్‌లో ఎక్కువ టికెట్స్ బుక్ అవుతుంటాయి. కానీ, సోమవారం బైకర్ సినిమాకు ఏకంగా 15.6 వేల టికెట్లు బుక్ అయ్యాయి. చాలా గ్యాప్ తర్వాత బైకర్‌తో శర్వానంద్ హిట్ కొట్టాడని సినిమా చూసిన ఆడియెన్స్ అంటున్నారు.

