కలం, నిజామాబాద్ బ్యూరో: పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని, అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) తెలిపారు. నిజామాబాద్ నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన ఎల్వోసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు.
నగరంలోని గౌతం నగర్ కు చెందిన హేమగ్న మూత్ర పిండాల వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రూ.2.40 లక్షల ఎల్వోసీ అందజేశామన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్య,,మని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: రాష్ట్రంపై కిషన్‌రెడ్డి కుట్రలు : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us On: X(Twitter)

