కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురు హత్యల (Shabad Murders ) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని గంటలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసినట్లు సమాచారం అందుతోంది.
అలర్ట్ అయిన పోలీసు యంత్రాంగం
రాజ్‌కుమార్ దొరికినట్లు వచ్చిన ఈ ఫోన్ కాల్‌తో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం అందిన వెంటనే డీసీసీ యోగేష్ గౌతమ్ రంగంలోకి దిగారు. ఆయన స్వయంగా సూర్యపేట ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ఈ క్రమంలోనే షాబాద్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు సూర్యపేట వైపు హుటాహుటిన బయల్దేరాయి. ఇదిలాఉంటే నిందితుడి ఆచూకీపై వచ్చిన సమాచారం ఎంతవరకు నిజం అనే కోణంలో పోలీసులు క్షేత్రస్థాయిలో తీవ్రంగా శోధిస్తున్నారు. వచ్చిన సమాచారం నిజమేనా? పుకారా? అనే విషయాలపై నిజా నిర్దారణ చేస్తున్నారు.

