కలం, మహబూబ్నగర్ బ్యూరో : ఉమ్మడి మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లాలో పలు రహదారుల విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy), పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు (Jupally Krishna Rao) మహబూబ్నగర్లో ఘన స్వాగతం లభించింది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంత్రులను సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికిన అనంతరం శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మంత్రుల పర్యటనతో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి. జానకి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహా రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

