షాబాద్ ఘటన.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా షాబాద్ ఘటన (Shabad Crime Case) కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షాబాద్ ఉన్మాది రాజ్ కుమార్ కిరాతక చర్యపై శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో బాధితుల కుటుంబాలను పరామర్శించి, మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ ఘటనపై స్పందిస్తూ, సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ నారాయణ రెడ్డి బాధిత కుటుంబంలోని దివ్యాంగురాలు మేఘనకు రూ.5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత వైద్యం, పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>