కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా కోహిర్ (Kohir) మండలం పిచరాగడి గ్రామంలో గాలిదుమారం తీవ్ర నష్టం కలిగించింది. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులతో రైతు రాంరెడ్డికి చెందిన అరటి తోట పూర్తిగా నేలమట్టమైంది. సుమారు మూడు ఎకరాలలో సాగు చేసిన ఈ తోట మరో నెల రోజులలో కోతకు సిద్ధంగా ఉండగా, ప్రకృతి విపత్తుతో పూర్తిగా నష్టపోయింది. గాలిదుమారం మూలంగా సుమారు 5 లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు రైతు రాంరెడ్డి తెలిపాడు. తనకు జరిగిన నష్టానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతు రాంరెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు.

