ఏపీలో నేడు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు

కలం, వెబ్ డెస్క్: భానుడి ప్రతాపంతో ఏపీ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. శుక్రవారం 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 55 మండలాల్లో వడగాలులు (Heatwaves) వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. రాష్ట్రంలోని పార్వతీపురం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 44.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, కడప జిల్లా ఒంటిమిట్టలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

రాబోయే 24 గంటల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం ప్రాంతాల్లోని సుమారు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. వీలైనంత వరకు ఇంట్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: రామలక్ష్మణులు వలస కూలీలు: ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>