కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (MallaReddy College)లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక, తీవ్ర మనోవేదనకు గురైన ఓ బీటెక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
ఏలూరు (Eluru) జిల్లా చిత్రాయి గ్రామానికి చెందిన జ్ఞానశ్రీ (21), మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో (MallaReddy College) మూడవ సంవత్సరం చదువుతోంది. గత నెల మార్చి 31న ఆమె తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. తండ్రి మరణం జ్ఞానశ్రీని తీవ్రంగా కలిచివేసింది. నాటి నుండి ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా, తండ్రి మరణం తర్వాత ఒంటరితనాన్ని భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: ఉద్యోగుల నిరసనకు సంపూర్ణంగా మద్దతునిస్తున్నాం: కవిత
Follow Us On: WhatsApp

