ఉద్యోగుల నిరసనకు సంపూర్ణంగా మద్దతునిస్తున్నాం: కవిత

కలం, వెబ్ డెస్క్: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత (Kavitha) మండిపడ్డారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈరోజు మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, అన్ని తరగతుల ఉద్యోగుల చేపట్టే నిరసన (Employees Protest) ప్రదర్శనకు సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆరు నెలల్లోపు పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చి 28 నెలలు గడిచినా ఆ మాటే ఎత్తడం లేదని దుయ్యబట్టారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (Contributory Pension Scheme) రద్దు చేసి పాత పెన్షన్ స్కీం అమలు చేస్తామన్న హామీని గాలికి వదిలేశారని విమర్శించారు. ఉద్యోగుల హెల్త్ స్కీం మాటలకే పరిమితం అయ్యిందని.. రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని చెప్పారు. కనీసం వైద్య ఖర్చులను కూడా రీయింబర్స్ చేయడం లేదని ఫైర్ అయ్యారు. పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను రేవంత్ సర్కార్ ఎప్పుడిస్తుందో చెప్పడం లేదని ఆమె (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: రామలక్ష్మణులు వలస కూలీలు: ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>