Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో మండుతున్న ఎండ‌లు.. అల్లాడిపోతున్న జనం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. శనివారం నిజామాబాద్ నగరంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రేపు ఆదివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద‌వుతాయని వచ్చే ఆదివారం నాటికి క్రమంగా 43, 44 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి.. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర జిల్లాలలో 44 కుపైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అలెర్ట్ ప్రకటిస్తున్నారు. పిల్లలు వృద్ధులను బయటకు పంపొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కూడా సూచిస్తున్నారు..

దాహం వేయకున్నా నీళ్లు తాగాలి – వైద్య నిపుణులు

ప్రస్తుత వేసవిలో దాహం వెయకున్నా నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దాని వల్ల శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఉంటుందని అంటున్నారు. గాలిలొ తేమ వడగాలుల ప్రభావంతో తొందరగా శరీరం హైడ్రేషన్ కు గురవుతుందని చెబుతున్నారు. నీళ్ల‌తో పాటు నిమ్మరసం కొబ్బరి బొండాలు పండ్ల రసాలు తాగితే కూడా ప్రయోజనం ఉంటుందని సలహాలు ఇస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>