కలం, మక్తల్: ఇటీవల మక్తల్ పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి మౌంటెన్ సైక్లింగ్ (Mountain Cycling) పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన బాల బాలికలు, మహిళలు పాల్గొని తమ అసమాన ప్రతిభను కనబరచారు. వారిలో 32 మంది బాల బాలికలు ఉండగా ఏడుగురు రాష్ట్ర స్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీలకు ఎంపికైనట్లు సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను శుక్రవారం మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు. ఈ నెల 5, 6 తేదీలలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు అవంతి, బాలమణి, రేణుక, స్వప్న, రమ్య, అనూష, వెంకటేష్, పరశురాం, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

