కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు (Sanjay Jaju) నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి రీలీవ్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కేడర్ అధికారి కావడంతో వెంటనే ఇక్కడ విధుల్లో జాయిన్ అయ్యేందుకు అడ్డంకులు తొలగినట్లయింది. 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా
పనిచేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయిన సుదీర్ఘ కాలం తరువాత తిరిగి రాష్ట్ర కేడర్‌కు రాబోతున్నారు.
ఈ నెలాఖరులో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు రిటైర్మెంట్ అవనుండటంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమైంది. రాష్ట్ర పాలనలో అత్యంత కీలమైన ఈ పదవి కోసం జయేశ్ రంజన్, వికాస్ రాజ్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు పోటీలో ఉన్నారు. తాజాగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు రాష్ట్రానికి వస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

