Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. కరీంనగర్ (Karimnagar) బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6, 7, 8వ తేదీల్లో నిర్వహించబోతున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల పోస్టర్లను జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందన్నారు. కంపెనీలు పెట్టే ఆంక్షలతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన చెందారు. వెంటనే కార్మికుల సంక్షేమం కోసం పని భద్రతతో పాటు వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పథకాలు తీసుకురావాలన్నారు. దీనిపైన రాష్ట్ర మహాసభలో తీర్మానం చేయబోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిమెంట్ గోదాముల హమాలీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జంగ తిరుపతి యాదవ్, బాగోతం వీరయ్య, పల్లేర్ల రాములు, నన్నవేని శ్రీనివాస్, నన్నవేని కొమురయ్య, జక్కుల ఐలయ్య, ముత్యాల శ్రీనివాస్, ఉప్పారపు శ్రీనివాస్, దానవేని కొమురయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>