Mobile Popup Ad
Mobile Popup Ad

సీతారామ ప్రాజెక్టుతో సాగునీటి వెలుగులు: పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పినపాక (Pinapaka) ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. అశ్వాపురం మండలం మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో పాటు బూర్గంపహాడ్ దోమలవాగు మినీ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ​అనంతరం మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సాగు నీటి వెలుగులు రాబోతున్నాయని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ కాలువ పినపాక (Pinapaka) నియోజకవర్గ వ్యవసాయ రంగానికి జీవనాడిగా మారుతుందన్నారు. మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కుడి, ఎడమ కాలువల ద్వారా సుమారు 17 వేల ఎకరాలు, దోమలవాగు మినీ రిజర్వాయర్ ద్వారా మరో 16 వేల ఎకరాలు కలిపి మొత్తంగా దాదాపు 33 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రాజెక్టు అనుసంధానంగా కాలువ గండి ద్వారా దోమలవాగుకు నీటిని మళ్లిస్తున్నట్లు వివరించారు. ​ఈ ప్రాజెక్టు నిర్మాణంతో భూగర్భ జలాల సామర్థ్యం పెరుగుతుందన్నారు. తాగు, సాగు నీటితో పాటు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతుందని పేర్కొన్నారు.

Read Also: నిరుద్యోగులపై లాఠీచార్జ్ అత్యంత హేయమైన చర్య: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>