కలం, నిర్మల్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ శుక్రవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ మేరకు బండికి వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులు, సహకారం అందించాలని కోరారు. అనంతరం బండి సంజయ్‌ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను శాలువాతో సత్కరించారు.

