పాక్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై ఇషాన్ కామెంట్స్

క‌లం, స్పోర్ట్స్: పాకిస్థాన్‌ అభిమానుల ట్రోలింగ్‌కు ఫైనల్‌ విజయం ద్వారా బదులిచ్చామని టీమిండియా యువ పేసర్‌ ఇషాన్‌ సూద్‌ (Ishan Sood) తెలిపాడు. లీగ్‌ దశలో పాకిస్థాన్‌ చేతిలో ఓడిన తర్వాత తమపై ఆ దేశ అభిమానులు తీవ్రంగా ట్రోల్‌ చేశారని వెల్లడించాడు. అందుకే అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో గెలిచిన తర్వాత అంతలా సంబరాలు చేసుకున్నామని వివరించాడు. 2026 అండర్‌-19 ఆసియా కప్‌లో ఇషాన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించాడు. ఫైనల్‌లో ఆడకపోయినా టోర్నీ మొత్తం తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిమాన ఆటగాళ్ల గురించి కూడా మాట్లాడాడు. బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా, బ్యాటర్లలో విరాట్‌ కోహ్లీ తనకు ఇష్టమని చెప్పాడు. కోహ్లీకి బౌలింగ్‌ చేయాల్సి వస్తే మొదట గుడ్‌ లెంగ్త్‌ బంతులు వేసి, ఆ తర్వాత స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుంటానని తెలిపాడు. తన లక్ష్యం అండర్‌-19 ప్రపంచకప్‌ గెలవడమేనని ఇషాన్‌ చెప్పాడు. తన తండ్రే తొలి కోచ్‌ అని, తన క్రికెట్‌ ప్రయాణం కోసం ఆయన రెండు షోరూమ్‌లను అమ్మి మరీ అండగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>