Mobile Popup Ad
Mobile Popup Ad

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ముత్తినేని వీరయ్య

కలం, మెదక్ బ్యూరో: దివ్యాంగుల సంక్షేమం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. మంగళవారం మెదక్ (Medak) జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య (), టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. 30 మంది దివ్యాంగులకు స్కూటీలు, 15 మంది లబ్ధిదారులకు బ్యాటరీ వీల్ చైర్లు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. దివ్యాంగులు స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల దివ్యాంగులు కూడా ప్రభుత్వ సేవలు సులభంగా పొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>