స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి: ఎస్సీ కార్పొరేషన్ ఈడీ

కలం, నిర్మల్‌: లబ్ధిదారులు దుకాణాల్లో వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌ అన్నారు. నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌ భవన సముదాయంలోని ఖాళీ దుకాణాల (SC Corporation Shops) ను గురువారం టెండర్ల ద్వారా దక్కించుకున్న లబ్ధిదారులకు అప్పగించారు.

ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. దుకాణాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పడిగెల రమణ, జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకటరమణ, సిబ్బంది స్వామి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>