గద్వాలలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు పురోగతిపై బీఆర్ఎస్ సమీక్ష

కలం, జోగులాంబ గద్వాల: పక్క రాష్ట్రం (కర్ణాటక)లో కాంగ్రెస్‌ను తిరస్కరించినట్లే, ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి భారీ విజయం ఖాయమని గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ (Anjaneya Goud) ధీమా వ్యక్తం చేశారు. గురువారం ​గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఓటర్ల నమోదు (Graduate Voter Registration) సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ, దాని పురోగతిపై నేతలతో కలిసి క్షుణ్ణంగా సమీక్షించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా, ఉపాధి రంగాలలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టభద్రులకు తీవ్ర విద్రోహం చేసిందన్నారు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే బొక్కబోర్లా పడిందో, తెలంగాణలోనూ రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కాంగ్రెస్ సర్కార్‌కు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని, రేవంత్ సర్కార్‌ వైఫల్యాలకు ఈ ఎన్నికల ఫలితాలే సరైన మందు అని అన్నారు.

​గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క అర్హులైన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలని, పాలమూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నేతలు హన్మంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, సూర్య గౌడ్, రాఘవేంద్ర రెడ్డి, పటేల్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు నరసింహులు, దుబన్న, సంటెన్న, గువ్వల గోపాల్, మోహన్ యాదవ్, చిత్తారి కిరణ్, సాకి డేవిడ్, రామకృష్ణ ముదిరాజ్, పవన్ కుమార్ సాగర్, చక్రధర్ రెడ్డి, కమ్మరి రాములతో పాటు నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>