కలం, వరంగల్: రాయపర్తి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో రాయపర్తికి చోటు దక్కకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాయపర్తి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. రాయపర్తి మండలంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
కరువు మండలాల జాబితాలో రాయపర్తిని చేర్చకపోవడం వలన రైతులకు ప్రభుత్వ సాయం అందకుండా పోయే ప్రమాదం ఉందని ఎర్రబెల్లి ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

