వనపర్తి జిల్లా ఆసుపత్రిలో వసతుల కొరత: సతీష్‌ యాదవ్‌

కలం, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని అఖిల పక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు డా.సతీష్‌ యాదవ్‌ (Satish Yadav) పేర్కొన్నారు. సోమవారం వేదిక సభ్యులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. రక్త నమూనాలు సేకరించే ప్రదేశంలో ఆహార పదార్థాలు, చీపుర్లు, ఇతర సామగ్రి ఉండటంపై సిబ్బందిని నిలదీశారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల రోగులకు ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఉందన్నారు. ఆసుపత్రి గోడలు పెచ్చులూడి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఏజెన్సీ గడువు ముగిసినా…

పారిశుద్ధ్య సిబ్బందిని ఇతర పనులకు వినియోగించడంతో ఆసుపత్రిలో శుభ్రత దెబ్బతింటోందని సతీష్‌ యాదవ్‌ ఆరోపించారు. పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీ గడువు ముగిసినా కొత్త టెండర్‌ ద్వారా సిబ్బందిని నియమించకపోవడంపై కలెక్టర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వనపర్తికి వచ్చే మంత్రులు ప్రభుత్వాసుపత్రిని స్వయంగా పరిశీలించి, మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు కొత్తగొల్ల శంకర్‌, బీజేపీ నాయకుడు రవి, రామస్వామి, శివకుమార్‌, సురేష్‌ యాదవ్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>