స్వర్ణ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కలం, నిర్మల్ : సారంగాపూర్ (Sarangapur) మండలంలోని స్వర్ణ గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు జూదరులను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రహస్య సమాచారం మేరకు పోలీసులు చేపట్టిన ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15,280 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మండలంలో పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>