Mobile Popup Ad
Mobile Popup Ad

సంజూ మరో సెంచరీ .. ముంబై టార్గెట్ 208

కలం, స్పోర్ట్స్ : సంజూ శాంసన్ మరోసారి విజృంభించాడు. ఐపీఎల్ 2026లో రెండో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ (CSK vs MI)లో సంజూ బౌండ్రీల వర్షం కురిపించాడు. 10 ఫోర్లు 6 సిక్సులతో 54 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ సంజూ మరోసారి శివమెత్తాడు. తన క్లాస్ ప్లస్ మాస్ ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు కొండంత స్కోరు అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ గెలవాలంటే ఇప్పుడు భారీగా శ్రమించాల్సి ఉంటుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాకులు తగిలినా, ఒకవైపు వికెట్లు పడుతున్నా సంజూ మాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 6 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. 187 స్ట్రైక్ రేట్‌తో ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రెవిస్ (21) కాసేపు మెరిసినా, మిగిలిన బ్యాటర్లు విఫలమైన చోట శాంసన్ అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు.

ముంబై బౌలర్లలో అఫ్గాన్ సంచలనం గజన్ఫర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అశ్విని కుమార్ కూడా 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులను నియంత్రించలేకపోయాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, హార్దిక్ పాండ్యా తన రెండు ఓవర్లలోనే 38 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. సాంట్నర్ తన కోటాలో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>