కలం, నేషనల్ బ్యూరో : కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో (Kerala Elections) సరికొత్త రికార్డు కోసం తహతహలాడుతున్న బీజేపీ (BJP) ఇతర పార్టీలన్నింటికంటే అడ్వాన్సులో ఉన్నది. ఎలక్షన్ షెడ్యూలు ప్రకటించిన గంటల్లోనే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషనే వెలువడలేదు.. కానీ బీజేపీ మాత్రం దూకుడుతో నిర్ణయం తీసుకున్నది. ప్రధాన పోటీ అధికార ఎల్‌డీఎఫ్, ప్రధాన ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ఉంటున్నా బీజేపీ సైతం ఈసారి ఇంప్రూవ్ కావాలన్న టార్గెట్ పెట్టుకున్నది. కేంద్ర మాజీ మంత్రులిద్దరికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం కేరళం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉన్న మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ (Rajeev Chandrasekhar) నేమమ్ నుంచి పోటీ చేయనున్నారు. మరో మాజీ మంత్రి వి మురళీధరన్ (Muraleedharan) కాళకూట్టమ్ నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ అధ్యక్షతన ఈ నెల 12న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఫస్ట్ లిస్టులో 47 మంది పేర్లు ఖరారయ్యాయి. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు.
మొత్తం 140 సీట్లున్న కేరళంలో కనీసంగా 100 చోట్ల పోటీ చేయాలన్నది బీజేపీ లక్ష్యం. అటు లెఫ్ట్ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కూటమికి సమదూరం పాటిస్తున్న బీజేపీ.. అక్కడి ట్వంటీ-20 అనే కొత్త రాజకీయ పార్టీతోనూ, భారత్ ధర్మ జనసేన అనే పార్టీతోనూ పొత్తు పెట్టుకుంటున్నది. ఈ రెండు పార్టీలకు కలిపి 40 స్థానాలను కేటాయించింది. బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో (Kerala Elections) 113 చోట్ల పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలవలేదు. అంతకుముందున్న ఒక్క సీటునూ చేజార్చుకున్నది. ఈసారి ఇద్దరు మాజీ కేంద్ర మంత్రుల్ని రంగంలోకి దించడంతో సీట్ల సంగతి ఎలా ఉన్నా ఓట్ షేర్ పెంచుకోవాలన్నది టార్గెట్. గత ఎన్నికల్లో బీజేపీ 11.3% ఓట్ షేర్ సాధించుకున్నది.
Read Also: వందే మాతరం సమయంలో ఎంఐఎం వాక్‌అవుట్.. బండి సంజయ్ ఫైర్
Follow Us On: X(Twitter)

