Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిల్టర్ సాండ్ తయారీని అరికడుతాం : కలెక్టర్ ప్రవీణ్యా

మెదక్, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో అక్రమ ఫిల్టర్ సాండ్ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రవీణ్యా హెచ్చరించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, భూగర్భజల శాఖ అధికారులతో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణా నివారణపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఇసుకను నిర్ణీత ధరలకే అందిస్తోందని చెప్పారు. నారాయణఖేడ్, జోగిపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ల ద్వారా ఇసుకను నిర్ణీత ధరల్లో అందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

దీనిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ ప్రవీణ్యా సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లాలో ఇసుక కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, గ్రావెల్ వినియోగానికి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాపై వాల్టా చట్టం కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>