విడాకులపై స్పందించిన టీవీకే చీఫ్ విజయ్

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. అయితే ఎన్నికల సమయంలో టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్‌ (Vijay) కు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఆయన భార్య సంగీత (Sangeetha) విడాకులు కావాలంటూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి విజయ్ అభిమానులు సైతం ఎంతో ఆందోళన చెందారు.

అయితే తాజాగా భార్య సంగీతతో విడాకుల(Divorce) విషయంపై విజయ్ (Vijay) స్పందించారు. ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యలపై ఎవరూ ఆందోళన చెందవద్దు. నాకు వచ్చిన ఆ సమస్యల కారణంగా ప్రజలు, అభిమానులు ఇబ్బంది పడుతుంటే నాకు చాలా భాధగా ఉంది. ‘ఆ సమస్యలు మీ సమయం కంటే విలువైనవేమీ కావు, ఆ ప్రాబ్లమ్స్ నేను హ్యాండిల్ చేసుకుంటా.. ఇప్పుడు మనమంతా ప్రజా సమస్యలపై ఫోకస్ చేద్దాం’ అంటూ అభిమానులకు పిలిపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>